2 Corinthians 7
"ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము."
"మమ్మును మీ హృదయములలో చేర్చు కొనుడి. మేమెవరికిని అన్యాయము చేయలేదు, ఎవరిని చెరుపలేదు. ఎవనిని మోసము చేయలేదు."
"మీకు శిక్షావిధి కలుగవలెనని నేను ఈలాగు చెప్పలేదు. చనిపోయిన గాని జీవించిన గాని మీరును మేమును కూడ ఉండవలెననియు, మీరు మా హృదయములలో యున్నారనియు నేను లోగ చెప్పితిని గదా?"
"మీ యెడల నేను బహు ధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మును గూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని యున్నాను, మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాము."
"మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటమును లోపల భయములు ఉండెను,"
అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను.
"తీతు రాక వలన మాత్రమే కాకుండ అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడ మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని."
నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్ములను స్వల్ప కాలము మట్టుకే దుఃఖపెట్టెనని తెలిసికొనియున్నాను.
మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవచిత్తానుసారముగ దుఃఖపడితిని.
దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దు:ఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.
"మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోను మీరు నిర్దోషులైయున్నారని రుజువు పరచుకొంటిరి."
"నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము వ్రాయలేదు, వాని వలన అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు, నా యెడల మీకున్న ఆసక్తి దేవుని యెదుట, మీ మధ్య బాహాటమగుటకే వ్రాసితిని."
ఇందుచేత మేము ఆదరింపబడితిమి. అంతేకాదు. మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీయందరివలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేమును సంతోషించితిమి.
"ఏలయనగా, నేనతని యెదుట మీ విషయమై ఏ అతిశయపడు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు, మేమేలాగు అన్నిటినీ మీతో నిజముగా చెప్పితిమో ఆలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపడు మాటలు నిజమని కనబడెను."
"మరియు, మీరు భయముతోను వణకుతోను తనను చేర్చుకొంటిరని అతడు మీ యందరి విధేయతను జ్ఞాపకము చేసుకొనుచుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ యెడల ఉన్నది."
ప్రతి విషయములోను మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను.